ఇవాళ విజయవాడకు సీఎం జగన్.. రాష్ట్రంలో తాజా పరిణామాలు.. శాంతి భద్రతలపై.. ఉన్నతాధికారులతో సమావేశం
CM Jagan: తాజా పరిణామాలతో సీఎం ఢిల్లీ టూర్‌కు ప్రాధాన్యత
CM Jagan: నేడు అర్ధరాత్రి విజయవాడకు సీఎం జగన్ రానున్నారు.. వారం రోజులు లండన్ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకోనున్నాడు. రాష్ట్రంతో తాజాపరిణామాలపై ఉన్నతాధికారులతో సీయం సమావేశం కానున్నారు.. నాలుగు రోజుల్లో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. వచ్చే వారం కేబినెట్ అనంతరం ఈ నెల 13, 14 వ తేదీలలో ఢిల్లీ లో పర్యటించనున్నారు.. ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు.. ఈ నెల 18 నుండి జరిగే పార్టమెంట్ సెషన్ లో కీలక బిల్లులు, జమిలి ఎన్నికలు, చంద్రబాబు అరెస్ట్.. తాజా పరిణామాలతో సీఎం ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.