Jagan Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం జగన్.. రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకం కానున్న వైసీపీ ఓట్లు..
CM Jagan Delhi Tour: ప్రధాని మోడీని కలవనున్న ముఖ్యమంత్రి జగన్
CM Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపటి ఢిల్లీ పర్యటనపై పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ పెద్దలతో రాష్ట్ర సమస్యలు మాట్లాడటంతో పాటు అతి త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికపై చర్చించేందుకే సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకు పూర్తిస్థాయి మెజారిటీ లేకపోవడంతో ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధారపడుతోంది. ఎలక్టోరల్ కాలేజీలో వైసీపీకి 4.1శాతం ఓటు బ్యాంకు ఉంది. జగన్ ఎన్డీఏ అభ్యర్థికి సై అంటే ఆ కూటమి అభ్యర్థి గెలవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఏపీలోని కీలక సమస్యలైన నిధుల కేటాయింపు, పోలవరం ప్రాజెక్టు స్థితిగతులు, ప్రత్యేక హోదా అంశాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జగన్ రెడ్డి చర్చించే అవకాశముందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.