CM Jagan: అధికారం అంటే అజమాయిషీకాదు.. మమకారం
CM Jagan: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
CM Jagan: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏదైనా కారణం చేత వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నామన్నారు.
ఏ కారణం చేతనైనా పథకాలు లబ్ధి అందని వారికి కూడా అందజేస్తున్నామన్నారు. అధికారమంటే అజమాయిషీ కాదు, ప్రజల పట్ల మమకారం చూపడమన్నారు. కొత్త పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు అందజేస్తున్నామన్నారు. పెన్షన్ల సంఖ్య మొత్తం 64లక్షల 27వేలకు చేరుకుందన్నారు.