CM Jagan : ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan : సీఎం జగన్‌కు వివరాలు అందించిన వైద్య శాఖ

Update: 2023-10-14 03:06 GMT

CM Jagan : ఆరోగ్య సురక్షపై కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan :  రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖ, కలెక్టర్లను ఆదేశించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 వేలకు పైగా ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించి ఒక్కో క్యాంపులో 357 మందికి వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం జగన్. సమావేశంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరాలు అందించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైందన్న జగన్. రోగులు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలతో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వైద్య శిబిరాల్లో రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని ఆదేశించారు.

వైద్య శిబిరాల నిర్వహణ, వసతులపై కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలతో పాటు మరిన్ని నిధులు ఇవ్వాలని ఉన్నాతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. చికిత్స అనంతరం వాడాల్సిన మందులను కూడా అందించాలన్నారు. క్రమం తప్పకుండా పేషంట్లకు చెకప్‌లు చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తూనే చికిత్స అవసరమని గుర్తించిన వారిని ఆరోగ్యం బాగయ్యేంత వరకు చేయిపట్టుకుని నడిపించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. ఇక ఆరోగ్య శ్రీలో కవర్‌ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న పాత రోగుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదని, ఆరోగ్య శ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలు కూడా ఇవ్వాలని ఆదేశించారు.

మూడు దశలుగా విభజించి ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు తెలిపారు సీఎం జగన్. ఇందుకోసం ప్రతి సచివాలయం వారీగా చికిత్స అవసరమైన వారి వివరాలు తీసుకోవాలని అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుందన్నారు. విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లతో సురక్ష శిబిరాలను అనుసంధానం చేయాలని సీఎం జగన్ అన్నారు. నెలకు ఒక మండలంలోని నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. క్యాంపులకు తప్పనిసరిగా నలుగురు వైద్యులు వెళ్లాలని, అందులో ఇద్దరు స్పెషలిస్టులు ఉండేలా చూడాలన్నారు. అలాగే వైద్య పరీక్షలు చేసేటప్పుడు మరింత నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు కూడా చేసి, సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News