పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు ప్లాట్లను అందించి వారి సొంతింటి కలను నిజం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా క్లియర్ టైటిల్ తో లాటరీ పద్దతిలో స్థలాను కేటాయించాలని అన్నారు. దీని కోసం మేదోమథనం చేసి విధానాన్ని రూపొందించాలని సీఎం జగన్ సూచించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్య నాథ్ దాస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీ వై శ్రీలక్ష్మీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయ్ కుమార్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.