CM Jagan: ఏపీలో కరెంట్ పరిస్థితిపై అధికారులతో జగన్ సమీక్ష
CM Jagan: కరెంట్ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికార్లతో చర్చ
CM Jagan: ఏపీలో కరెంట్ కోతలు లేకుండా చూసుకోవాలని అధికార్లను జగన్ ఆదేశించారు. కరెంటు పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలో వివిధ థర్మల్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆరా తీశారు. థర్మల్ కేంద్రాలను పూర్తి సామర్ధ్యంతో నడిపేలా చర్యలు తీసుకోవాలని, బొగ్గు నిల్వలు ఎక్కడున్నా కొనుగోలు చేయాలని సూచించారు. బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. కృష్ణ పట్నం, వీటీపీఎస్ లలో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించి 1600 మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తేవాలన్నారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు,ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలన్నారు.