మనబడి, నాడు-నేడుపై సీఎం జగన్‌ సమీక్ష

*రెండో విడత నాడు-నేడు పనులకు సిద్ధం కావాలన్న సీఎం *ఏప్రిల్‌ 15నుంచి పనులను ప్రారంభిస్తామన్న అధికారులు *రెండో విడత పనులకు రూ.4,446కోట్లు ఖర్చవుతుందని అంచనా

Update: 2021-02-03 12:26 GMT

సీఎం జగన్‌ సమీక్ష 

మనబడి నాడు-నేడుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రెండో విడత నాడు-నేడు పనులకు సిద్ధం కావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 15 నుంచి పనులను ప్రారంభిస్తామన్న అధికారులు.. డిసెంబర్‌ 31లోగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రెండో విడత పనులకు 4వేల 446 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాడు-నేడు మొదట విడత పనుల్లో భాగంగా 3 వేల 700 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. స్కూళ్లను బాగు చేయడానికి ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు అన్నారు.

మరోవైపు విద్యార్థుల హాజరుపై యాప్‌ ద్వారా వివరాలు సేకరించేలా ఏర్పాట్లు చేయాలని జగన్‌ ఆదేశించారు. స్టూడెంట్స్‌ స్కూల్‌కు గైర్హాజరైతే తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందించాలని, రెండోరోజు కూడా రాకపోతే నేరుగా విద్యార్థి ఇంటికి వాలంటీర్‌ను పంపి వివరాలు సేకరించాలని అన్నారు. గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం పక్కా అమలు చేయాలన్న జగన్.. నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులను సూచించారు. టాయిలెట్ల నిర్వహణకు సులభ్‌ ఇంటర్నేషనల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, టాయిలెట్‌ నిర్వహణా సిబ్బందికి సులభ్‌ ఇంటర్నేషనల్‌ శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News