ఓ డాక్టర్ కోసం కదిలిన గ్రామం..స్పందించిన సీఎం.. త‌క్ష‌ణ‌మే కోటి సాయం

Corona Second Wave: అందరినీ మంచిగా చూడటం.. అందరిలో మంచిని చూడటం నీ బలహీనత అయితే ప్రపంచంలో నీ అంత బలవంతుడు లేడు అంటారు.

Update: 2021-06-06 08:24 GMT

Corona Second Wave: ఓ డాక్టర్ కోసం కదిలిన గ్రామం.. స్పందించిన సీఎం

Corona Second Wave: అందరినీ మంచిగా చూడటం.. అందరిలో మంచిని చూడటం నీ బలహీనత అయితే ప్రపంచంలో నీ అంత బలవంతుడు లేడు అంటారు. అప్పుడప్పుడూ కొందరిని చూస్తే ఈ సూక్తి నిజమనిపిస్తుంది. ప్రకాశం జిల్లా కారంచేడులో సరిగ్గా అలాంటి వ్యక్తిత్వం కలిగిన ఓ డాక్టర్‌ను చూస్తుంటే ఈ కొటేషన్ కు ప్రత్యక్షరూపమే ఆయన అనిపిస్తుంది.

38 యేళ్ళ భాస్కర్ రావు పిహెచ్‌సి వైద్యుడిగా చేసిన సేవలకు కారంచేడు గ్రామం పులకించింది. కరోనా మొదటి వేవ్ లో ఆ ఊరిలో చాలా‌ మందికి కరోనా సోకితే దగ్గరుండి వైద్యసేవలు అందిచాడు‌. సెకండ్ వేవ్ మొదలయ్యాక కూడా చురుకైన పాత్ర పోషించాడు. ఇదే సమయంలో విధి వంచించింది. ఆయన్ను కరోనా కాటేసింది. ఈ దయనీయ పరిస్థితిని చూసిన కారంచేడు గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ సందర్భంగా మండలం, మండలం కదిలొచ్చి తమకు తోచిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు.

ఏప్రిల్ 21వ తేదీన భాస్కరరావుకి కోవిడ్ సోకింది. తొలుత సాధారణ చికిత్స, జాగ్రత్తలు తీసుకున్న ఆయన తర్వాత విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో చేరారు. అక్కడ ఊపిరితిత్తుల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హైదరాబాద్‌‌కు తరలించారు. మే 24 నుంచి పరిస్థితి మరింత విషమించింది. రెండు లంగ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల మార్పిడి తప్పదని డాక్టర్లు తేల్చేశారు. కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని, నెలలోపే సర్జరీ పూర్తి చేయాలని ఆయన భార్య భాగ్యలక్ష్మికి వైద్యులు సూచించారు.

ఓ ప్రభుత్వ డాకర్టు పట్ల ప్రజల స్పందన.. పేద జనంతో పెనవేసుకున్న అనుబంధం గురించి తెలుసుకున్న మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి భాస్కర్ రావు వైద్యానికి కోటి రూపాయల సాయమందించారు.

ఒకరి పట్ల మనం సేవగుణం ప్రేమ గుణం కలిగి ఉంటే చాలు వారందరూ అదే గుణంతో స్పందిస్తారు. అది ఇలాంటి సమయాల్లోనే వెలుగు చూస్తుంది. సమాజాన్ని జనాన్ని ప్రేమించండి. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు డ్యూడ్.

Full View


Tags:    

Similar News