CM Jagan: జగనన్న తోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్
CM Jagan: ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరువ్యాపారులకు మంచి జరిగింది
CM Jagan: చిరు వ్యాపారులకు లబ్ది చేకూర్చే జగనన్న తోడు పథకానికి సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. దేశంలో ఎక్కడా ఇన్ని లక్షలమందికి ఈ రకంగా మంచి చేయడం లేదని సీఎం జగన్ తెలిపారు. దేశం మొత్తం ఇస్తున్న రుణాలు కంటే... ఏపీలో లబ్ధిదారుల సంఖ్య అంత కన్నా ఎక్కువ ఉందని అన్నారు. పేదవాడికి మంచి జరిగించే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోందని తెలిపారు. ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరువ్యాపారులకు మంచి జరిగిందన్నారు. హస్తకళాకారులకూ ఈ పథకం ద్వారా మేలు జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు.