ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

*ప్రధానితో పలు కీలక అంశాలపై చర్చించిన ఏపీ సీఎం

Update: 2022-04-05 15:00 GMT

ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

CM Jagan: ప్రధానమంత్రి మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. మధ్యాహ్నం ఢిల్లీ ప‌ర్యట‌న‌కు బ‌య‌లుదేరిన జ‌గ‌న్‌ రాజధాని చేరుకున్న వెంట‌నే సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట‌కు పైగా ఈ స‌మావేశం జ‌రిగింది. ఈ భేటీలో జ‌గ‌న్ ప‌లు కీల‌క అంశాల‌ను ప్రస్తావించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని మోడీకి వివ‌రించిన జ‌గ‌న్‌ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును కూడా వివ‌రించారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు ప్రస్తుత ప‌రిస్థితిని ప్రధానికి వివ‌రించిన జ‌గ‌న్‌ రాష్ట్రానికి సంబంధించిన ప‌లు పెండింగ్ అంశాల‌పై కూడా చ‌ర్చించారు. రాష్ట్ర రెవెన్యూ లోటును మ‌రోమారు ప్రస్తావించారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన బ‌కాయిల గురించి కూడా మోడీకి వివ‌రించిన‌ట్లు స‌మాచారం.

Tags:    

Similar News