YSR Jagananna Colonies: సొంతింటి కల నెరవేరుస్తున్నాం- సీఎం జగన్
YSR Jagananna Colonies: పేదవారి సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణం నేడు ప్రారంభం అయ్యింది.
YSR Jagananna Colonies: పేదవారి సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణం నేడు ప్రారంభం అయ్యింది. క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదన్నారు. రాష్ట్రంలోని పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
మొదటి దశలో 28 వేల 84 కోట్ల రూపాయలతో 15 లక్షల 60 వేల పక్కా ఇళ్లను నిర్మిస్తున్నారు. తొలిదశ ఇళ్లను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. రెండో దశలో మరో 12 లక్షల 70 వేల ఇళ్ల నిర్మాణం జరగనుండగా మొత్తం 2023 నాటికి నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు హామీ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం.