జగనన్న తోడు పథకం ప్రారంభం

Update: 2020-11-25 07:34 GMT

ఏపీలో జగనన్న తోడు పథకం నేడు ప్రారంభమైంది. క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు 10 వేల రూపాయల చొప్పున రుణాలు అందించనున్నారు. ఇప్పటి వరకు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులను గుర్తించారు. 10 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రుణాలు ఇవ్వనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈరోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. పలెల్లో, పట్టణాల్లో, వీధివీధికీ చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, శంకర్‌నారాయణ, ఆదిమూలపు సురేష్‌ సహా ఇతరు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Full View


Tags:    

Similar News