పంచాయతీ ఎన్నికలకు సీఎం జగన్ భయపడరు - రోజా

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తీరుపై ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా మండిపడ్డారు.

Update: 2021-01-24 10:21 GMT

రోజా ఫైల్ ఫోటో 

తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తీరుపై ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా మండిపడ్డారు. ఉద్యోగులు, ప్రజల ప్రాణాలు పణంగాపెట్టి ఎన్నికలు జరపాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు ఆమె. ఇక ఎన్నికలకు సీఎం జగన్‌ భయపడేవ్యక్తి కాదన్నారు రోజా.

మరోవైపు రాష్ట్రంలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్టు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. తొలిదశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలకు ఎన్నికలు లేవని తెలిపారు. మిగిలిన 11 జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.

తొలిదశలో 11 జిల్లాల్లోని 14 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో భాగంగా 12 జిల్లాల్లోని 17 డివిజన్లు, మూడో విడతలో 13 జిల్లాల్లోని 18 డివిజన్లు, నాలుగో విడతలో 13 జిల్లాల్లోని 19 డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

Tags:    

Similar News