Chandrababu Naidu: సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్‌ను పక్కనపెట్టిందన్న సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. గత తె2014 -2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టింది. 2024లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ సెంటర్‌ను సందర్శించారు. ప్రస్తుతం ఈ కేంద్రం పనితీరును.. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం సిఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో RTG కేంద్ర కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశం అయ్యారు. RTG ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం...పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చంచారు. రానున్న రోజుల్లో RTG ద్వారా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ప్రజలకు సంబంధించిన మాస్టర్ డాటాను RTG కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడంపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.