AP Free Bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నేడు కీలక ప్రకటన..!
AP Free Bus Scheme: సూపర్ సిక్స్‌లో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.
AP Free Bus Scheme: సూపర్ సిక్స్‌లో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం వచ్చి ఇప్పటికే రెండు నెలలు అవడంతో.. వీలైనంత త్వరగా హామీలు అమలుచేయడంపై దృష్టిపెడుతోంది. ఇందులో భాగంగానే నేడు సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై సమావేశంలో చర్చించనున్నారు. దీంతో ఈ పథకంపై ఇవాళే నిర్ణయం వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటక, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేశారు. పథకం అమలు, అందుకు అయ్యే ఖర్చులపై వివరాలతో కూడిన నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికపై సీఎం సమీక్షలో చర్చించనున్నారు. దసరా నుంచి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తుండగా.. ఈ స్కీమ్ కోసం ప్రత్యేక బస్సులను కూడా నడిపించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే 15 వందల బస్సులను కొనుగోలు చేయగా.. మరిన్ని బస్సులు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.