వెలగపూడిలో టెన్షన్ టెన్షన్

Update: 2020-12-28 10:18 GMT

గుంటూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య తలెత్తిన ఆర్చ్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడికి దారి తీసింది. ఈ ఘర్షణలో ఓ మహిళ మృతి చెందగా మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

రాళ్ల దాడిలో చనిపోయిన మహిళ మృతదేహంతో బంధువులు రాత్రి నుంచి ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై టెంట్ వేసి బైఠాయించారు. ఎంపీ నందిగం సురేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతురాలి బంధువులతో పోలీసులు చర్చలు జరిపినప్పటికీ బాధిత కుటుంబం ఆందోళన విరమించేందుకు ససేమిరా అంటోంది.

ఆందోళనకారులను శాంతింపజేసేందుకు వెళ్లిన హోంమంత్రి సుచరిత‌కు కూడా చేదు అనుభవం ఎదురైంది. సుచరిత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. అయితే, వెలగపూడి ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి సుచరిత. బాధితులను ఆదుకుంటామని మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 

Tags:    

Similar News