CJI NV Ramana: నాగార్జున యూనివర్సిటీలోనే ఉజ్వల భవిష్యత్తుకు బీజం పడింది..
CJI NV Ramana: డిగ్రీ చదువుకున్న తర్వాత ఉద్యోగాన్వేషణలో ఉన్నపుడు నాగార్జున యూనివర్సిటీ ఉద్యోగుల ప్రోద్బలంలోనే న్యాయవాద వృత్తిలోకి వచ్చానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
CJI NV Ramana: డిగ్రీ చదువుకున్న తర్వాత ఉద్యోగాన్వేషణలో ఉన్నపుడు నాగార్జున యూనివర్సిటీ ఉద్యోగుల ప్రోద్బలంలోనే న్యాయవాద వృత్తిలోకి వచ్చానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ అందుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. భవిష్యత్తుకు బీజంపడింది నాగార్జున యూనివర్సిటీలోనే అని గుర్తుచేసుకున్నారు.
నాగార్జున యూనివర్సిటీలో తమ అడ్డా క్యాంటీనేనని.. క్యాంటీన్‌లో కూర్చొని అనేక విషయాలపై చర్చించే వాళ్లమన్నారు. లా కాలేజీ వల్ల మిగిలిన విద్యార్ధులు చెడిపోతున్నారనే ఆరోపణలతో తమ కాలేజీని తరలించాలనే ప్రతిపాదన జరిగిందన్నారు. నాడు వివిధ అంశాలపై యువతలో జరిగిన చర్చ ఇప్పుడు జరగడం లేదని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. సమస్యలపై యువత స్పందించకపోవడం సమాజానికి మంచిది కాదన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యా విధానం ఉండాలన్నారు.