City Bus Services in AP: ఈ నెల 20 నుంచి సిటీ బస్సులు.. ఆమోదం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదన

City Bus Services in AP | ఇప్పటి వరకు దూర ప్రాంతాల వరకే పరిమితమైన ఏపీఎస్ ఆర్టీసీ ఇక నుంచి సిటీల్లోనూ నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Update: 2020-09-12 01:32 GMT

APSRTC City Bus Services

City Bus Services in AP | ఇప్పటి వరకు దూర ప్రాంతాల వరకే పరిమితమైన ఏపీఎస్ ఆర్టీసీ ఇక నుంచి సిటీల్లోనూ నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ముందుగా ఈ నెల 20 నుంచి ఏపీలో జరగనున్న సచివాలయ పోస్టుల పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే రోజు నుంచి ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది. దీనికి సంబంధించి తయారు చేసిన ప్రతిపాధనలను ఉన్నతాధికారులకు పంపారు. ఆ ప్రతిపాదనలను ఆమోదించి, గ్రీన్ సిగ్నల్ ఇస్తే బస్సులు నడిపేందుకు సంస్థ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 20 నుంచి ప్రధాన నగరాల్లో సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల రాతపరీక్షలు ఉండడంతో అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉంది. 10 లక్షల మంది పరీక్షలు రాస్తుండటంతో ఇందుకు తగ్గట్టుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

► రాష్ట్రంలో మే 21 నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

► అప్పటి నుంచి అన్ని జిల్లాల్లో రోజూ 3 వేలకు పైగా సర్వీసులను తిప్పుతూ 3.50 లక్షల మందిని ఆర్టీసీ చేరవేస్తోంది.

► అయితే విజయవాడ, విశాఖపట్నంలలో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించలేదు.

► సచివాలయ ఉద్యోగాలకు పరీక్షల నేపథ్యంలో హెల్త్‌ ప్రొటోకాల్‌ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుమతి కోసం ఫైల్‌ను పంపింది. ఆయన, సీఎస్‌ నీలం సాహ్ని నిర్ణయం తీసుకుని సిటీ బస్సు సర్వీసులకు అనుమతి ఇస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నరు. 

Tags:    

Similar News