తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినినటి నందిని రాయ్

Update: 2020-12-28 06:36 GMT

 తిరుమల శ్రీవారిని సినినటురాలు నందిని రాయ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చేల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం పలుకగా. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ. స్వామి వారిని చాలా రోజుల తరువాత దర్శచుకోవడం చాలా సంతోషంగా ఉంది.

 శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రతి భక్తుడి శానిటైజేషన్ అందేలా టీటీడీ ఏర్పాట్లు చేసారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ మొదటి సారిగా వైకుంఠ ద్వా ప్రవేశం చేసాను. స్వామి వారిని దర్శించుకుని వెళ్ళిన తరువాత నాకు మొత్తం ఎనిమిది చిత్రాలు రావడంతో స్వామి వారికి కృతజ్ఞతలు చెప్పడానికి రావడం జరిగిందని ఆమె తెలిపారు.

Tags:    

Similar News