CID: రఘురామకృష్ణరాజుకు సాంకేతికంగా సహకరించింది ఎవరు ?

CID: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఇంకా పలు కోణాల్లో విచారిస్తున్నారు.

Update: 2021-05-15 07:27 GMT

CID: రఘురామకృష్ణరాజుకు సాంకేతికంగా సహకరించింది ఎవరు ?

CID: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఇంకా పలు కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు ఆయన అరెస్టుపై హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. విచారణ పూర్తయ్యే వరకు ఎంపీని మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచవద్దని హైకోర్టు ఆదేశించింది.

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఎంపీ రఘురామకృష్ణరాజు ఉద్దేశపూర్వకంగానే విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని సీఐడీ ఆరోపిస్తోంది. అందుకు తగ్గ పక్కా ఆధారాలు ఉన్నాయని సీఐడీ అధికారులు అంటున్నారు. రఘురామకృష్ణపై 124A, 153A, 505, 120B, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే రఘురామకృష్ణరాజుతోపాటు ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారని అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన సీఐడీ బృందాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజుకు సాంకేతికంగా ఎవరు సమకరిస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News