Andhra Pradesh: అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ దూకుడు
Andhra Pradesh: అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. మరో అడుగు ముందుకేసిన సీఐడీ అధికారులు అసైన్డ్ భూములను అమ్మిన రైతులను ప్రశ్నించారు.
Andhra Pradesh: అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. మరో అడుగు ముందుకేసిన సీఐడీ అధికారులు అసైన్డ్ భూములను అమ్మిన రైతులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆర్కే ప్రస్తావించిన రైతులను విజయవాడ సీఐడీ ఆఫీస్‌కు, తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నారు. ఐదు బృందాలతో గ్రామాల్లో దర్యాప్తు జరుపుతోన్న సీఐడీ బెదిరించి భూములను కొనుగోలు చేశారన్న ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. అలాగే, రైతుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేస్తున్నారు. ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గంలోని రాయపూడి ఉద్దండరాయునిపాలెంలోని రైతుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.