Chandrababu Arrest: చంద్రబాబు నుంచి సీఐడీ ఎలాంటి సమాచారం రాబట్టనుంది..?

Chandrababu Arrest: ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ

Update: 2023-09-23 03:45 GMT

Chandrababu Arrest: చంద్రబాబు నుంచి సీఐడీ ఎలాంటి సమాచారం రాబట్టనుంది..?

Chandrababu Arrest: కాసేపట్లో సీఐడీ ఎదుట హాజరుకానున్నారు మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. స్కిల్‌ స్కామ్‌పై చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే రెండు రోజుల పాటు ఈ విచారణ ఎపిసోడ్‌ మొత్తం జరగనుంది. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్యం, వయసు రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక..

రెండు రోజుల కస్టడీ ముగిసిన అనంతరం.. ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలని తెలిపింది. చంద్రబాబు సీఐడీ విచారణ నేపథ్యంలో రాజమండ్రికి చేరుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. బ్రాహ్మణి, భువనేశ్వరి ఇప్పటికే రాజమండ్రిలో ఉన్నారు. మరోవైపు.. క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లోకేష్‌.. అక్కడి న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే.. స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబును గతంలో రెండురోజుల పాటు సీఐడీ అధికారులు విచారించారు. అయితే.. విచారణకు చంద్రబాబు సహకరించడంలేదని అప్పట్లో అధికారులు తెలిపారు. దీంతో.. ఇప్పుడు మరోసారి సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. గత విచారణలో అడిగిన ప్రశ్నలనే మళ్లీ వేస్తారా..? ఒకవేళ అవే ప్రశ్నలు మళ్లీ వేస్తే.. వాటికి చంద్రబాబు ఇచ్చే సమాధానం ఏంటి..?.. గతంలో సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరిచంలేదు.. ఇప్పుడు కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుందా..? ఈ రెండు రోజుల కస్టడీ పిరియడ్‌లో.. చంద్రబాబు నుంచి సీఐడీ అధికారులు ఎలాంటి సమాచారం రాబడతారు..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Tags:    

Similar News