మోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
Andhra Pradesh: మోడీతో మెగా మీట్‌ను హైలైట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్
Andhra Pradesh: దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జులై 4న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అల్లూరి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు ప్రభుత్వం తరుపున మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం తరుపున ఆహ్వానిస్తూ ఓ లేఖను చిరంజీవికి కిషన్ రెడ్డి పంపించారు. అయితే ఈ లేఖ తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరుపున చిరంజీవికి అందిందా.. లేక పర్సనల్‌గా మాత్రమే పంపారా అన్నది తెలియాల్సి ఉంది.
ప్రధానితో వేదికను పంచుకోబోతున్న చిరంజీవి అంటూ మెగా టీమ్ హడావుడి ప్రచారం చేసింది. ఓ విధంగా మోడీ ప్రాపకం కోసం చిరంజీవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నట్టుగా ఈ ప్రచారం కన్పించింది. అయితే ముందు నుంచి బిజెపి తో సన్నిహితంగా ఉంటున్న పవన్ కల్యాణ్ కు ఎలాంటి ఆహ్వానం లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
అయితే ప్రధాని పాల్గొనే సభకు సిఎం జగన్ కూడా హాజరవనున్నారు.ఈ క్రమంలో పవన్ కంటే చిరంజీవిని ఆహ్వానించటం ద్వారా వేడుకలో పాల్గొనే వారందరికీ అక్కడ కంఫర్టబుల్ గా ఉంటుందనే, పవన్ కాదని మెగాస్టార్ ను పిలిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కూడా జగన్ ఉన్న స్టేజ్ పై ఉండేందుకు ఇష్టపడరన్న విషయం తెలిసిందే. ఇక చిరంజీవి అయినా, పవన్ అయినా ఇండస్ట్రీ వ్యక్తులుగా కంటే అల్లూరికి సంబంధించిన జిల్లా వాసులుగా ఈ వేడుకకు ఆహ్వానితులే అన్నది వారి అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట. పైగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఏపీలో కాపు సామాజిక వర్గం సపోర్ట్ ను ఆశిస్తున్న బిజెపి.... పవన్ , చిరంజీవి లను హైలైట్ చేయటం ద్వారా తమ స్ట్రాటజీలను అమలు చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఈక్రమంలో సమయం సందర్బాన్ని చూసి చిరంజీవిని ఆహ్వానించారని టాక్.
ఇక ప్రస్తుతం చిరంజీవి తన షెడ్యూల్స్ తో బిజీగానే ఉన్నా , మోడీతో స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం రావటాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బు అయిపోతారు. మరి స్టేజ్ పై అటు మోడీ , ఇటు చిరు ఏం మట్లాడతారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.