కడప జిల్లాలో మూడురోజులపాటు పర్యటించనున్న సీఎం జగన్
* తొలిరోజు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌కు చేరకున్న జగన్ * దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించిన సీఎం * స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ మేరకు భద్రతా ఏర్పాట్లు * కుటుంబసభ్యులతో కలిసి మినీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, సీఎం జగన్ నివాళులు అర్పించారు. కడప జిల్లాలో సీఎం మూడురోజుల పాటు పర్యటించనున్నారు. ముందుగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కోవిడ్ నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం మినీ క్రిస్మస్ వేడుకల్లో తల్లి విజయమ్మ, సతీమణి భారతి రెడ్డితో కలిసి సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సీఎం వెంట డిప్యూటీ సీఎం అంజద్ భాష, మంత్రులు ఆదిమూలపు సురేష్, అప్పలరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంఎల్సీ జకియా ఖానం, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఉన్నారు.