కొనియాడిన తెలంగాణ గవర్నర్ తమిళి సై.. టీటీడీ నిర్ణయానికి భక్తుల నుంచి విశేష స్పందన
Tirumala: సత్ఫలితాలు ఇస్తున్న వీఐపీ బ్రేక్ దర్శనంలో మార్పులు
Tirumala: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వీఐపీలకూ ఇబ్బంది లేకుండా చేయడానికి టీటీడీ పాలకమండలి కొత్త పద్ధతిని స్టార్ట్ చేసింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో తీర్మానించారు. దీంతో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పద్ధతిని అమలు చేశారు. ఈ పద్ధతి ఎలా ఉందో హెచ్ఎంటీవీ స్టోరీలో చూద్దాం.
తిరుమల శ్రీవారి దర్శన విధానంలో సామాన్యులకు సర్వదర్శనం, టైం స్లాట్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, లక్కీ డిప్ ఆర్జిత సేవల ద్వారా శ్రీవారిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. గతంలో భక్తుల రద్దీకనుగుణంగా రోజుకోసారి మాత్రమే బ్రేక్ దర్శనాన్ని అమలు చేసే వారు. ఆ విధానానికి స్వస్తి పలికి సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు. వీఐపీలు తమ వ్యక్తిగత సిపార్సు, బంధుమిత్రులకు సిపార్సు లేఖలు అందిస్తుంటారు. తద్వారా వివిధ ఆర్జిత సేవలు, రద్దీని బట్టి బ్రేక్ దర్శనాలు కల్పిస్తూ వస్తోంది టీటీడీ... రోజుకు రెండు సార్లు వీఐపీ బ్రేక్ దర్శనాలు నిర్వహించే వారు. ఆ పద్ధతిని మార్చేశామంటున్నారు టీటీడీ చైర్మన్... మిగితా ఆయన మాటల్లోనే విందాం.
అయితే వీఐపీ బ్రేక్ దర‌్శనం అమలులో మొదటి రోజు కొంత గందరగోళం ఏర్పడినా రెండో రోజు నుంచి మంచి స్పందన వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 2లో అర్ధరాత్రి ప్రవేశించిన భక్తులు వీఐపీ బ్రేక్ సమయం అయ్యే వరకు వేచి ఉండేవారు. దాదాపు 10 గంటల సేపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 2లోని కంపార్‌మెంట్‌లో వేచి ఉండక తప్పేది కాదు. ఈ విధానానికి స్వస్తి పలికారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి. బ్రేక్ సమయం ఉదయం 8 నుంచి 12లోపు తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేశారు. ప్రతి రోజూ ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటలలోపు దాదాపు 15 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ విధానం అమలు చేయడం వల్ల సామాన్యులకు త్వరిత గతిన దర్శన భాగ్యం కలుగుతోందంటున్నారు టీటీడీ ఈఓ.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని శ్రీవారి దర్శనం విధానంపై నూతన ఒరవడిని కొనియాడారు. సామాన్య భక్తులే వీఐపీలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న టీటీడీ అధికారులు., పాలక మండలిని ఆమె అభినందించారు.
టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమని బీజేపీ నాయకులు కూడా కొనియాడారు. టీటీడీ తీసుకున్న నిర్ణయం సామాన్య భక్తులకు వరమన్నారు. సామాన్యుల తరువాతే వీఐపీలు అంటూ బ్రేక్ దర్శనంలో మార్పు తీసుకురావడం ఆనందంగా ఉందంటున్నారు. ఇదే విధానాన్ని కొనసాగించాలని కోరారు. సామాన్య భక్తులు కూడా టీటీడీని ప్రశంసిస్తున్నారు.