Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం..

Chandrayaan 3:నింగిలోకి బాహుబలి రాకేట్‌.. మూడు అంచెల్లో ప్రయోగం

Update: 2023-07-12 14:11 GMT

Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. 

Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక దశ పూర్తయింది. దాదాపు 24 గంటల పాటు చంద్రయాన్ -3 రిహార్సల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తల సమూహం ఉత్కంఠ భరితంగా ఈ కీలక పరీక్షలను పూర్తి చేసింది. ఎల్లుండి మధ్యాహ్నం రోదసిలోకి దూసుకెళ్లనున్న ఈ కేంద్రీ ప్రయోగానికి రేపు కౌంటన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

జాబిల్లి దక్షిణ ధృవం పై సమగ్ర సమాచారం కోసం నిర్దేశించిన చంద్రయాన్-3 ప్రయోగ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి ఇస్రో శ్రీకారం చుట్టింది. చంద్రయాన్ -2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.

 గత అనుభవాలను గుణపాఠాలుగా తీసుకున్న ఇస్రో...ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కొద్ది పాటి లోపాలను సరిదిద్దుతూ చంద్రుడిపై ల్యాండ్ రోవర్ క్షేమంగా దిగే విధంగా ఈసారి ఉపగ్రహాన్ని ఇస్రో సిద్ధం చేసింది. ఎల్లుండి చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించనుంది ఇస్రో. మధ్యాహ్నం 2గంటల 35 నిమిషాలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే చంద్రాయన్‌ స్పేస్ క్రాఫ్ట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. దీన్ని జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ మార్క్-3తో అనుసంధానించింది. ఇప్పటికే చంద్రయాన్ -3 ప్రయోగం పూర్తిస్థాయి రిహార్సల్స్‌ను విజయవంతంగా ముగించింది ఇస్రో. దాదాపు 24 గంటల పాటు రిహార్సల్స్ ప్రక్రియ సాగింది. అనంతరం రిహార్స్ ప్రక్రియ విజయవంతం కావడంతో ఈ యొక్క ప్రధాన ప్రయోగంపై ఈ దృష్టి పెట్టింది.

ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3లో అనేక విశేషాలున్నాయి. దాదాపు 43.5 మీటర్ల పొడవు ఉన్న ఈ రాకెట్ మూడు రకాల ప్రొపెల్లెంట్‌లను ఉపయోగిస్తుంది. ఈ ప్రొపెల్లెంట్లల్లో గల స్ట్రాప్-ఆన్ బూస్టర్‌లలో ఘన రూపంలో ఉన్న ఇంధనాన్ని వినియోగించింది. కోర్ దశలో ద్రవ ఇంధనం, చివరిదశలో క్రయోజెనిక్ ఇంధనాన్ని వాడారు. 204.5 టన్నుల ఘన ఇంధన శక్తి..బూస్టర్లకు లభించినట్లు నిన్నటి రిహార్స్‌ల అనంతరం ఇస్రో తెలిపింది.

చంద్రయాన్ -3లో ప్రతి దశను అత్యంత సూక్ష్మ పరిశీలనతో ఇస్రో రూపకల్పన చేసింది. కోర్ స్టేజ్, అప్పర్ స్టేజ్‌లల్లో ఒక్కొక్కటి 115.8, మరియు 28.6 టన్నుల ప్రొపెల్లెంట్‌లను కలిగి ఉంటాయి. 3వేల 900 కేజీల చంద్రయాన్ 3 బరువును కూడా పరిగణనలోకి తీసుకుంటే - రాకెట్ మొత్తం 642 టన్నుల బరువును మోసుకుంటూ చంద్రమండలం వైపు దూసుకెళ్తుంది. ఆగస్టు 23 నాటికి ఈ వాహక నౌక 3.43లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిర్దేశించిన జాబిల్లి స్థావరానికి చేరుతుంది. అప్పటినుంచి ఇప్పటివరకు రోదసిలో ఏ దేశం గుర్తించని అనేక విశ్వ రహస్యాల విశేషాలను విశ్వానికి తెలియజేయునుంది ఇస్రో.

Tags:    

Similar News