Chandrababu: ప్రతి నెలా రెండు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu: మే మొదటి వారం నుండి బాబు పర్యటన

Update: 2022-04-20 04:00 GMT

Chandrababu: ప్రతి నెలా రెండు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్లీ పవర్‌లోకి వచ్చేందుకు తన జన్మదిన వేడుకల సందర్బంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పాదయాత్ర చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తన కుమారుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయుడుతో పాదయాత్ర చేయించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. యువనేత లోకేష్ పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్‌ను చుట్టి వచ్చేలా ప్లాన్ చేస్తున్న చంద్రబాబు తాను బస్సుయాత్రలు, రోడ్‌షోలకు రెడీ అవుతున్నారు. ఏలూరు జిల్లా నెక్కలం-గొల్లగూడెం గ్రామంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల సమరశంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో టూర్‌కు సిద్ధమవుతున్న చంద్రబాబు పార్టీ పండుగ మహానాడును గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. పుట్టినిల్లు రాయలసీమకు దగ్గరా ఉండేలా ఒంగోలులో మహానాడు నిర్వహణకు మొగ్గుచూపారు చంద్రబాబు. తెలుగుదేశాన్ని పవర్‌లోకి తీసుకురావడం, పార్టీలో లోకేష్‌కు ఎదురులేకుండా చూసుకోవడం అనే ద్విముఖ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు.

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ త్వరలో పాదయాత్రతో జనంలోకి వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇక ప్రతి నెలా రెండు జిల్లాల్లో పర్యటించాలని చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇవాళ తన జన్మదినం సందర్భంగా ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగానే ఏలూరు జిల్లా నెక్కలం-గొల్లగుడెం గ్రామంలో జన్మదిన వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు ఆ పై గ్రామసభ నిర్వహించనున్నారు. మే మొదటి వారం నుండి చంద్రబాబు టూర్ ప్రారంభం కానుంది. రోడ్డు షో లేక గ్రామ సభ మాదిరిగా కార్యక్రమం సాగనుంది. మే మొదటి వారంలో కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు మే 27 నుండి 3 రోజుల పాటు ఒంగోలులో మహానాడు నిర్వహించనున్నారు. రాయలసీమ జిల్లాల్లో నేతలకు అందుబాటులో ఉండేలా ఒంగోలులో మహానాడు నిర్వహణకు ప్లాన్ చేశారు.

ఇక మహానాడు తర్వాత లోకేష్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లాలని లోకేష్ ఇప్పటికే నిర్ణయించారు. రాబోవు 2, 3 నెలల్లో ఖరారు లోకేష్ రోడ్ మ్యాప్ ఖరారు కానుంది. తన తండ్రి బాటలో తాను కూడా పాదయాత్ర చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు నారా లోకేష్. వయసురీత్యా చంద్రబాబుకి పాదయాత్ర ఇబ్బంది కాబట్టి తానే చొరవ చూపిస్తున్నారు లోకేష్. ఇక ఇప్పటికే మంగళగిరిలో ప్రతి వార్డ్‌లో పర్యటిస్తున్న లోకేష్ అటు సీనియర్స్ తో చంద్రబాబు, యువతతో లోకేష్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News