Laddu Dispute: లడ్డూ కల్తీపై చంద్రబాబు సంచలన నిర్ణయం..నేడు తిరుమలలో ప్రత్యేక హోమం
Laddu Dispute:తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి పవిత్రతను ఎవరూ మలినం చేయలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Laddu Dispute: తిరుమల శ్రీవేంకటేశ్వరుడి లడ్డూ వివాదంపై చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల పవిత్రతను ఎవరూ మలినం చేయలేరన్నారు. టీటీడీ పవిత్రతను కాపాడటం కూటమి బాధ్యత అని, వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేస్తామని తెలిపారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పరిహారం కోసం మహాశాంతి హోం చేయాలని ఆగమ సలహామండలి నిర్ణయించినట్లు తెలిపారు.
ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగ్రవ్యప్రోక్షన చేయనున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతోపాటుగా అధికార దుర్వినియోగం పైనా కూడా విచారణ చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేవాదాయశాఖ తరపున అన్ని దేవాలయాల్లోనూ హోమాలు చేయడంతోపాటు నాణ్యత ప్రమాణాలు పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఐజీ ఆపై స్థాయి అధికారి నేత్రుత్వంలో సిట్ వేస్తామని తెలిపారు. సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరలా పునరావ్రుతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఆయా ప్రార్దనా మందిరాల్లో ఆ మతం వారే బాధ్యతలు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.