Ambati Rambabu: పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణం
Ambati Rambabu: పోలీసులపై దాడిని పవన్ కల్యాణ్ ఖండించకపోవడం విచారకరమన్న అంబటి
Ambati Rambabu: పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణమని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయం నుంచి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాయలసీమకు ద్రోహం చేశారనే దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు పుంగనూరుకి వెళ్ళారని తెలిపారు. ఆ ప్రాంతంలో హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించిందని.. భారీ నీటి ప్రాజెక్టులతో పాటు పలు చిన్న- చిన్న డ్యామ్లు కూడా కడుతున్నామని అన్నారు. పోలీసుల పై టీడీపీ నేతలు దాడి చేస్తే దానిని పవన్ కల్యాణ్ ఖండించకపోవడం విచారకరమని అంబటి అన్నారు.