Chandrababu: చంద్రబాబు ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
Chandrababu: జులై 24కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు ఫైల్ చేసేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో విచారణను జులై 24కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆయన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సుందరేష్ , జస్టిస్ S.V.N భట్టి ధర్మాసనం విచారణ జరిపింది. వేసవి సెలవుల తర్వాత కేసు విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరడంతో.. తదుపరి విచారణను జులై 24కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.