Chandrababu: నేడు కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన
Chandrababu: మండపేట, కొత్తపేట, అమలాపురంలో పర్యటన
Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు మూడు రోజులు పాటు పర్యటించనున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. నేడు మండపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక రాజమండ్రి తొర్రేడు గ్రామం GSN ఫంక్షన్ హాల్ నుండి మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్డు మార్గంలో మండపేట నియోజకవర్గ ఏడిద వెళ్లనున్న చంద్రబాబు... ఏడిదలో స్థానిక రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మండపేటలో రోడ్ షో నిర్వహించి కలవపువ్వు సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రెండో రోజు కొత్తపేట నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు.. మూడోరోజు అమలాపురం నియోజకవర్గంలో టూర్ కొనసాగనుంది.