Chandrababu Arrest: రెండ్రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు

Chandrababu Arrest: విచారణ తీరును మానిటరింగ్ చేస్తామన్న న్యాయమూర్తి

Update: 2023-09-22 10:44 GMT

Chandrababu Arrest: రెండ్రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు

Chandrababu Arrest: ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు షాక్ తగిలింది. రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్ లోనే చంద్రబాబును విచారించాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు.. విచారణకు సంబంధించి కస్టడీ డేట్లను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

అంతకుముందు.. క్వాష్ పిటిషన్‌ అంశంలోనూ చంద్రబాబుకు హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సీఐడీ తరఫు లాయర్ల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. హైకోర్టులో ఊరట దక్కుతుందని చంద్రబాబు అనుకున్నారు. అయితే.. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై పైకోర్టులో పోరాడతామని, సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ,చంద్రబాబు లాయర్లు చెబుతున్నారు.

మరోవైపు ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు ఊరట దక్కలేదు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రెండు రోజుల పాటు రిమాండ్‌ పొడిగించారు. చంద్రబాబు రిమాండ్ ఎల్లుండి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన 24వరకు జ్యూడిషీయల్ రిమాండ్‌లోనే ఉండనున్నారు. స్కిల్ స్కామ్‌లో ఈ నెల 9న చంద్రబాబును అరెస్టు చేసింది సీఐడీ. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా...14రోజుల రిమాండ్ విధించింది.

రెండు రోజుల పాటు రిమాండ్ పొడిగింపు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేత.. సీఐడీ కస్టడీకి అనుమతి.. ఇలా స్కిల్‌ స్కాం కేసులో అరెస్టైన బాబుకు షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. స్కిల్ కేసులో.. చంద్రబాబును విచారించాలని, డబ్బులు ఎలా చేతులు మారాయి, చివరికి ఎవరి అకౌంట్‌లోకి చేరాయనే అంశాలపై చంద్రబాబును విచారించనుంది సీఐడీ.

Tags:    

Similar News