Chandrababu: ఉత్తుత్తి ప్రకటనలు మాని దోషులకు శిక్ష పడేలా చూడండి..
Chandrababu: ఉత్తుత్తి ప్రకటనలు మాని దోషులకు శిక్ష పడేలా చూడండి..
Chandrababu: దిశ చట్టం ప్రకారం చర్యలంటూ చేస్తున్న ప్రకటనలు ఆపాలని, సీఎం జగన్ చేసే ఉత్తుత్తి ప్రకటనలు ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రకటనలకే పరిమితం అవుతుందని ఆ ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. కాకినాడలో దేవిక హత్య విషయంలో చట్టమే లేని దిశ చట్టం ప్రకారం నిందితులపై చర్యలంటూ సీఎం ప్రకటనలు చేయడం మోసగించడమేనన్నారు.
సీఎం, ప్రభుత్వం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలు మాని, నిందితులకు వెంటనే శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారాయన...అప్పుడే నేరస్థులకు భయం ఉంటుందని, మహిళలకు నమ్మకం కలుగుతుందన్నారు. కొత్త చట్టాలు కాదని, కనీసం ఉన్న చట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారాయన..గుంటూరు జిల్లాలో వివాహిత ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం ఎంత అలసత్వం ఉందో అర్థమవుతుందన్నారు.