Chandrababu Naidu writes letter to AP Governor: గవర్నర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Chandrababu Naidu writes letter to AP Governor: మూడు రాజధానులు, CRDA రద్దు బిల్లుల ఆమోదం కోసం శనివారం గవర్నర్ కు చేరాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచంద్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు.

Update: 2020-07-19 07:42 GMT
Chandrababu Naidu writes letter to AP Governor Over AP Capitals

Chandrababu Naidu writes letter to AP Governor: మూడు రాజధానులు, CRDA రద్దు బిల్లుల ఆమోదం కోసం శనివారం గవర్నర్ కు చేరాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచంద్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. మూడు రాజధానుల ప్రక్రియ అనాలోచితమని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీలో ఉన్న బలంతో బిల్లులు ఆమోదించుకున్నారని.. బిల్లులు సెలెక్ట్ కమిటీ దగ్గర పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ప్రజల మనోభావాలు అలోచించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ ను కోరారు చంద్రబాబు. అమరావతి అనేది ప్రజా రాజధాని అన్న చంద్రబాబు.. అమరావతికి ఆనాడే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని అన్నారు.

అమరావతికోసం ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. అంతేకాకుండా 2006 అమరావతికి దలైలామా వచ్చారని.. అమరావతి అనేది ఒక సెంటిమెంట్ అన్నారు. ఎట్టి పరిస్థితులలోను బిల్లులను ఆమోదించవద్దని చంద్రబాబు లేఖలో గవర్నర్ ను కోరారు. కాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా గవర్నర్ కు లేఖ రాశారు. మూడు రాజధానుల బిల్లులను ఎట్టి పరిస్థితులలో ఆమోదించవద్దని లేఖలో పేర్కొన్నారు. అయితే కన్నా లేఖ పట్ల బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్నా రాసిన లేఖ అచ్చం టీడీపీ నేతలు రాసినట్టుగానే ఉందని.. కన్నా రాసిన లేఖతో తమకెలాంటి సంబంధం లేదనే విధంగా కొందరు బీజేపీ నేతలు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News