ఏలూరులో ప్రజలకు అస్వస్థత ప్రభుత్వ వైఫల్యమే.. : చంద్రబాబు
ఏలూరులో ప్రజలకు అనారోగ్యం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పారిశుధ్యలోపాన్ని సరిదిద్దకుండా, పరిస్థితులను బేరీజు వేసి సరైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.
ఏలూరులో ప్రజలకు అనారోగ్యం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పారిశుధ్యలోపాన్ని సరిదిద్దకుండా, పరిస్థితులను బేరీజు వేసి సరైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. వ్యాధిగ్రస్తుల లక్షణాలపై దృష్టి పెట్టడం.. సరైన కార్యాచరణ దిశగా అడుగులేయడం జగన్ ప్రభుత్వం చేయడం లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ తక్షణం హెల్త్ ఎమర్జెన్సీని విధించాల్సిన అవసరముందని అన్నారు.
అటు సీఎం జగన్ ఏలూరులో పర్యటించారు. అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన జగన్, అనంతరం అధికారులతో భేటీ అయ్యారు. ఏలూరులో పరిస్థితులపై చర్చించారు. బాధితులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. అవసరమైతే అదనపు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.