ChandraBabu Naidu, Pawan Kalyan Respond on Fire Accident: విజయవాడ అగ్ని ప్రమాదంపై పవన్, చంద్రబాబు దిగ్భ్రాంతి
ChandraBabu Naidu, Pawan Kalyan Respond on Fire Accident: విజయవాడ గవర్నరుపేటలోని కరోనా ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా...మరికొందరు గాయపడ్డారు
ChandraBabu Naidu, Pawan Kalyan Respond on Fire Accident: విజయవాడ గవర్నరుపేటలోని కరోనా ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా...మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆక్కడ 30 మంది కోవిడ్ రోగులు, 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పీఎం నరేంద్ర మోదీ కూడా సీఎం జగన్‌కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అమిత్ షా, సీఎం జగన్ సహా పలువురు ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కరోనా సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరగడం దిగ్భ్రాంతికరమన్నారు. పలువురు మృతి చెందడం ఆవేదనకు గురిచేస్తోందన్నారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని చంద్రబాబు కోరారు.
అలాగే, ఈ ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. 11 మంది మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడకు చేరినవారు ఈ విధంగా ప్రమాద బారినపడటం అత్యంత విషాదం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
In deep anguish after learning about the fire accident at the Vijayawada Covid Centre this morning. I extend my deepest condolences to the families who have lost their loved ones and pray for the speedy recovery to those injured. pic.twitter.com/s3sRHQaxEt
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 9, 2020