నేడు రాజమహేంద్రవరం చేరుకొనున్న చంద్రబాబు నాయుడు..
Rajamahendravaram: రాజమహేంద్రవరం వేమగిరిలో టిడిపి మహానాడుకు భారీగా ఏర్పాట్లు
Rajamahendravaram: తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వేమగిరిలో టిడిపి మహానాడుకు భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఎన్టీఆర్ శత జయంతోత్సవాలకు వేదికైన రాజమహేంద్రవరంకు నేడు చంద్రబాబు నాయుడు ,లోకేష్ టిడిపి ముఖ్య నేతలు చేరుకొనున్నారు. ఈరోజు రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకోనున్న చంద్రబాబు సాయంత్రం ఐదు గంటలకు మంజీర హోటల్ లో ప్యాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. 27, 28 రెండు రోజులపాటు మహానాడు జరగనుంది. 27న సుమారు 50 వేల మంది ప్రతినిధులతో 10 ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు.వివిధ రకాల గోదావరి రుచులతో భోజన సదుపాయాలు ఏర్పాటు చేసారు టిడిపి నేతలు.28న సుమారు 15 లక్షల మందితో 140 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు.
200 ఎకరాల్లో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మహానాడు సభలో మొత్తం 20 అంశాలపై టిడిపి తీర్మానాలు చేయనుంది. అందులో 14 ఆంధ్ర ప్రదేశ్ కోసం, ఆరు తెలంగాణ రాష్ట్రం కోసం తీర్మానం చేయనునుంది టిడిపి. శుక్రవారం జరిగే ప్రతినిధుల సభలో జాతీయ అధ్యక్షున్ని ఎన్నుకుంటారు. అంతేకాకుండా మహానాడు సభా ప్రాంగణం పార్కింగ్ కోసం కూడా టిడిపి నేతలు ప్రత్యేక ఏర్పాటు చేసారు . అంతేకాకుండా 20 లక్షల పైగా వాటర్ బాటిల్స్ ,మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేసారు. రెండు రోజులు సభా ప్రాంగణం వద్ద చంద్రబాబు నాయుడు , లోకేష్ బస్సులో బస చేయనున్నారు.