Chandrababu: స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు

Chandrababu: హెల్త్ బులిటెన్ విడుదల చేసిన జైలు అధికారులు

Update: 2023-10-13 05:07 GMT

Chandrababu: స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు

Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు.. స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారు. చంద్రబాబు మొహంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి వైద్యం చేసిన వైద్యులు.. జైలు అధికారులకు పలు సూచనలు చేశారు. వైద్యుల సూచనలను పాటిస్తున్నామని హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇవాళ మరోసారి చంద్రబాబును పరీక్షించనున్నారు. చంద్రబాబు బరువు తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. ప్రతిరోజు మూడుసార్లు ఫిజికల్ వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షల్లో బీపీ, షుగరు, హార్ట్‌బీట్ ఫిజికల్ పరీక్షలు నార్మల్‌గా ఉన్నట్లు జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

Tags:    

Similar News