Chandrababu: చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై కొనసాగుతోన్న విచారణ
Chandrababu: వాదనల అనంతరం ఆర్డర్స్ ఇవ్వనున్న న్యాయమూర్తి
Chandrababu: చంద్రబాబు కస్టడీ పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. ఏసీబీ కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేశారు చంద్రబాబు లాయర్లు. ప్రస్తుతం చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. హౌస్ కస్టడీ పిటిషన్ అనంతరం సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఇప్పటికే సీఐడీ తరపు లాయర్లు ఏజీ శ్రీరామ్, ఏఏజీ సుధాకర్ ఏసీబీ కోర్టుకు వెళ్లారు. వాదనల అనంతరం కస్టడీపై తీర్పు వెలువరించనున్నారు న్యాయమూర్తి.