Chandrababu: అమరావతే నిలుస్తుంది.. అమరావతే గెలుస్తుంది.. ఇదే ఫైనల్..
Chandrababu: అమరావతే నిలుస్తుంది.. అవరావతే గెలుస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.
Chandrababu: అమరావతే నిలుస్తుంది.. అవరావతే గెలుస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. అమరావతి రాజధానిగా ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన రోజును పురస్కరించుకుని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. వెయ్యేళ్ల తెలుగుజాతి గుండెచప్పుడు అమరావతి అన్న బాబు.. వైసీపీ తుగ్లక్ పాలనలో రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు.
తాను ఉన్నంత వరకు 28వేల మంది రైతుల త్యాగం, కోట్లమంది సంకల్పం వృదాపోదన్నారు. ఎన్నికల ముందు దీన్ని స్వాగతించిన వ్యక్తి.. అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశారు. ఆంధ్రుల రాజధాని ఎప్పటికీ అమరావతే. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుంది. సత్యం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది. అమరావతే గెలుస్తుంది.. ఇదే ఫైనల్ అని చంద్రబాబు పేర్కొన్నారు.