Chandrababu: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఎవరిచ్చారు
Chandrababu: విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు
Chandrababu: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని తరగతుల పరీక్షలను వాయిదా వేసిందే. అయితే టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రగడ కొనసాగుతోంది. వద్దని విపక్షాలు మొత్తుకుంటుంటే.. పెట్టి తీరుతామంటోంది అధికార పక్షం. విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు పెడుతున్నామన్నారు సీఎం జగన్. దీంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు చంద్రబాబు.
మరోవైపు చంద్రబాబు విమర్శలను తిప్పికొట్టారు టీటీడీ చైర్మన్. పదో తరగతి విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టెన్త్ పరీక్షల విషయంలో రాజకీయాలు చేాయోద్దని చంద్రబాబునుద్దేశించి మండిపడ్డారు. అలాగే కోవిడ్ నేపథ్యంలో టెస్ట్ రిపోర్టులు చూసి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతినిచ్చే ఆలోచనలో ఉన్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెపుతున్నారు.