Chandrababu: రాజధాని లేని రాష్ట్రాన్ని మతిలేని ముఖ్యమంత్రి పాలిస్తున్నాడు

Chandrababu: రాయలసీమ పర్యటన చేస్తున్న చంద్రబాబునాయుడు

Update: 2023-08-03 01:51 GMT

Chandrababu: రాజధాని లేని రాష్ట్రాన్ని మతిలేని ముఖ్యమంత్రి పాలిస్తున్నాడు

Chandrababu: రాజధాని లేని రాష్ట్రాన్ని మతిలేని ముఖ్యమంత్రి పాలిస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. పిల్లా పాపలకు రాష్ట్ర రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చాడని చంద్రబాబు మండి పడ్డారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల తీరూతెన్నులను స్వయంగా పరిశీలించేందుకు రాయలసీమ పర్యటన చేస్తున్న చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో రోడ్ షో నిర్వహించారు.

పులివెందుల గడ్డపై చంద్రబాబునాయుడి గర్జన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపుచేసింది. పులివెందుల రోడ్డుకూడలి తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో జన సంద్రాన్ని తలపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని నినదించారు. పార్టీ కార్యకర్తల్లో చంద్రబాబు జోష్ నింపారు.

Tags:    

Similar News