Andhra Pradesh: కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh: కుప్పంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరుపై ఆరా తీశారు చంద్రబాబు.

Update: 2021-02-20 10:57 GMT

చంద్ర బాబు ఫైల్ ఫోటో (ThehansIndia)

మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు(chandrababu) కుప్పం తెలుగుదేశం నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలు జరిగిన తీరుపై ఆరా తీశారు. రౌడీయిజం, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి వైసీపీ విజయం సాధించిందని తెలిపారు. వైసీపీకి అధికారుల సహకారం అందించారని ఆరోపించారు. టీడీపీ నేతలు కూడా పోలింగ్ బూత్ లను, కౌంటింగ్ ను విడిచిపెట్టి తిరిగారని చురకలు అంటించారు. ఎవరేం చేస్తార్లే అని కౌంటింగ్ ను వదిలేశారని... ఈలోపల ఫలితాలను అధికారులు తారుమారు చేశారని అన్నారు.

అప్రమత్తంగా ఉండాలని తాను చాలా సార్లు చెప్పానని చంద్రబాబు గుర్తు చేశారు. మనలోని బలహీనతలు, అనైక్యతను అవతలివారు అడ్వాంటేజ్ గా తీసుకుంటారని తెలిపారు. మనం ఎంత బాగా పని చేసినా అధికార పార్టీ అరాచకాల వల్ల ఓటమిపాలయ్యామని చెప్పారు. విలువలకు ప్రాధాన్యతనిచ్చే కుప్పం వ్యక్తిత్వాన్ని ఈ ఎన్నికల ఫలితాలు దెబ్బతీశాయని అన్నారు. త్వరలోనే మబ్బులు తొలగిపోతాయని టీడీపీ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా తీర్చుకుందామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు చంద్రబాబుతో మాట్లాడారు. తాము ఎన్నికల్లో సమిష్టిగా పనిచేశామని, అధికారపార్టీ ఆరాచకంతోనే ఓడిపోయామని చంద్రబాబులో వారు చెప్పారు.

Tags:    

Similar News