విజయవాడలో చైన్ లింక్ సంస్థ మోసాలు.. వంద కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించిన సంకల్ప్ సిద్ధి మార్ట్
* లక్ష కడితే రూ.3 లక్షలు ఇస్తామని భారీగా డిపాజిట్ల సేకరణ.. డబ్బు చెల్లించటం లేదని బెజవాడ పోలీసులకు బాధితుల ఫిర్యాదు
Chain Link Company Scam: విజయవాడలో చైన్ లింక్ సంస్థ మోసాలు వెలుగులోకి వచ్చాయి. వంద కోట్లకు పైగా సంకల్ప్ సిద్ధి మార్ట్ డిపాజిట్లు సేకరించింది. లక్ష కడితే 3 లక్షల రూపాయలు ఇస్తామని భారీగా డిపాజిట్ల సేకరించారు. దీంతో డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.