Ex-Gratia for Vijayawada Fire victims: మృతుల కుటుంబాల‌కు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా : కేంద్రం

Ex-Gratia for Vijayawada Fire victims: విజయవాడ స్వర్ణ ప్యాలస్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు.ఈ ఘటనపై ప్రధాని స్పందించారు.

Update: 2020-08-09 15:32 GMT

Ex-Gratia for Vijayawada Fire victims: విజయవాడ స్వర్ణ ప్యాలస్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు.ఈ ఘటనపై ప్రధాని స్పందించారు. అగ్నిప్రమాదం చాలా ఆవేదనకు గురిచేసింది. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డితో చర్చించానని, అన్ని విధాలా సహకరిస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.

ఈ ప్రమాదానికి గురైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి 50వేల రూపాయలు సాయాన్ని అందిస్తున్నట్టు పీఎంఓ ట్వీట్ చేసింది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి చెల్లించనున్నట్లు పీఎంఓ ఆదివారం ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉండగా విజయవాడ హోటల్ అగ్ని ప్రమాదంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. మరణించిన 10 మందిలో తొమ్మిది మంది ఊపిరి పీల్చలేక మరణించగా ఒక మహిళ పూర్తిగా కాలిపోయి మరణించిందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె. నరేశ్‌ వెల్లడించారు. 


Tags:    

Similar News