Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరో ముందడుగు
Steel Plant: ప్రైవేటీకరణపై పలు మంత్రిత్వ శాఖలతో కమిటీ ఏర్పాటు * ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు
Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పలు మంత్రిత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులతో ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉక్కు కర్మాగారం నుంచి ఇద్దరు ముఖ్యులు ఉంటారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ సాంకేతిక సహకారం తీసుకోవడంతో పాటు.. ప్రైవేటీకరణకు సంబంధించిన విధివిధానాలపై రూపకల్పనను సిద్ధం చేస్తున్నారు. ఈ కమిటీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అధ్యయనం చేసి.. నివేదికను కేంద్రానికి పంపనుంది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కార్మికులు, ప్రజా సంఘాలు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం ఈ ఆందోళనలకు మద్దతు పలికాయి. అయినా కేంద్రం మాత్రం తన పంతం నెక్కించుకునే దిశగానే అడుగులు వేస్తోంది. ఒకవైపు వ్యతిరేకతలు ఎదురువుతున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా స్పీడ్ పెంచింది. ప్రైవేటీకరణ సాధ్యసాధ్యాలపై ఏకంగా ఓ అధ్యయన కమిటీనే నియమించింది.