Senior NTR: ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం.. రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ..!
Senior NTR: అధికారులు చూపెట్టిన నమూనాకు పురంధేశ్వరి ఓకే
NTR Coin: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి NTRకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో NTR బొమ్మతో వంద రూపాయల వెండి కాయిన్‌ను భారత ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇది వరకే ఈ విషయాన్ని ప్రకటించినా మింట్ కాంపౌండ్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని కలిసి ఆమె సలహాలను కోరారు. పురంధేశ్వరికి వారు ఈ వెండినాణేన్ని, దానిపై NTR బొమ్మ మోడల్‌ను చూపించారు. ఈ నమూనాకు పురంధేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే NTR బొమ్మతో 100 రూపాయల నాణెం బయటికి రానుంది.