Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం గందరగోళ ప్రకటనలు

Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై రాజకీయ సెగలు పుడుతున్నాయి.

Update: 2023-04-14 15:00 GMT

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం గందరగోళ ప్రకటనలు 

Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై రాజకీయ సెగలు పుడుతున్నాయి. నాయకుల వ్యాఖ్యలు ఓ విధంగా ఉంటే... కేంద్రం ప్రకటన మరో విధంగా ఉంది. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీన్‌లో బీఆర్ఎస్ సైతంకీ రోల్ పోషిస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కేంద్రం ప్రకటనపై అయోమయం నెలకొంది.

ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్‌ వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆహ్వానించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్‌ విషయంలో ప్లాంట్ సీఎండీతో ఎంపీ జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. వర్కింగ్ క్యాపిటల్‌ను పొందే అంశాలపై చర్చించారు. బయట సంస్థల సహకారం లేకుండా జాతీయ బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశంపై చర్చలు జరిపారు. జాతీయ బ్యాంకులతో రుణాలు పొందగలిగితే సింగరేణి కాలరీస్‌తో పాటు ఇతర ప్రైవేట్ స్టీల్ మేకర్స్‌కు అవకాశం ఇవ్వకుండానే వర్కింగ్ క్యాపిటల్‌ పొందేలా ప్లాన్ చేశారు.

మీటింగ్ ముగిసిన అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. అందరూ ఆమోదిస్తే తప్పా.. ఇప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదన్నారు. తప్పుడు ప్రచారాలతో కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక స్టీల్ ప్లాంట్‌ పెట్టుబడుల కోసం పిలిస్తే.. ఏకంగా ఆ ఉక్కు పరిశ్రమనే కొనేసినట్లు కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేయడం అవివేకమన్నారు జీవీఎల్.

జీవీఎల్ ప్రైవేటీకరణ ఉండదన్న కాసేపటికే... కేంద్రం బాబు పేల్చింది. ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఉక్కు శాఖ కీలక ప్రకటన చేసింది. ఇటీవల తాత్కాలికంగా ప్రైవేటీకరణ నిలిపేసినట్లు వార్తలు రాగా.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్‌ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. స్టీల్ ప్లాంట్ పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని కేంద్ర ఉక్కుశాఖ ప్రకటించింది. దీంతో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్ర తీరు అయోయమానికి గురి చేస్తోంది. 

Tags:    

Similar News