Viveka Murder Case: వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్‌కు సీబీఐ కోర్టు సమన్లు
Viveka Murder Case: ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి సమన్లు
Viveka Murder Case: వివేకా హత్య కేసులో అవినాష్‌కు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. ఆగస్టు 14న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై ఛార్జిషీట్ వేసిన సీబీఐ.. 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డి పేరును చేర్చింది.