YS Vivekananda Reddy Murder Case Updates: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం
YS Vivekananda Reddy Murder Case Updates: కడపలో 2019 ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఓ సంచలన విషయం. వివేకాను దుండగులు తన సొంత ఇంట్లోని అత్యంత కిరాతంగా గొడ్డలితో నరికి చంపారు.
YS Vivekananda Reddy Murder Case Updates: కడపలో 2019 ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఓ సంచలన విషయం. వివేకాను దుండగులు తన సొంత ఇంట్లోని అత్యంత కిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని వైసీపీ అధినేత జగన్, వైఎస్ వివేకా కూతురు సునీతలు హైకోర్టును ఆశ్రయించారు. జగన్ అధికారంలోకి వచ్చాక సీబీఐకి ఈ దర్యాప్తును అప్పగిస్తూ వేసిన పిటిషను ఉపసంహరించుకున్నారు. కానీ వైకాపా నేతల పేర్లు చెబుతూ వైఎస్ వివేకా కూతురు సునీత మాత్రం సీబీఐ దర్యాప్తు కావాలని కోర్టును కోరింది. కేసు పురోగతిని పరిశీలించిన కోర్టు సీబీఐ దర్యాప్తుకు అప్పజెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఈ కేసులో విచారణ చేయడానికి సీబీఐ అధికారులు ముగ్గురు సభ్యుల సాంకేతిక బృందాన్ని రంగంలోకి దించారు. వివేకానంద రెడ్డి, మరికొందరి అనుమానితుల కాల్ డేటాను విశ్లేషించనుంది. హత్య జరిగిన రోజు వివేకా ఫోన్కు ఎవరి వద్ద నుంచి కాల్్స వచ్చాయి. ఆయన ఎవరికి ఫోన్ చేశారో పూర్తి స్థాయి డేటా సేకరించనున్నారు. అనుమానితులు ఎవరెవరితో మాట్లాడారు..ఎవరికైనా సంక్షిప్త సందేశాలు పంపారా… విషయాలను సీబీఐ సాంకేతిక బృందం పరిశీలించనుంది. సీబీఐ అధికారులు కడప ఎస్పీ అన్భురాజన్ ను కలిశారు. అనంతరం వారు పులివెందులకు వెళ్లనున్నారు. నేటి నుంచి అనుమానితులను పూర్తిస్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసు విషయంలో త్వరలోనే కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా... ఇప్పటికే పోలీసులు స్థానికులతో సమాచారాన్ని సేకరించడంతో పాటు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీబీకి అప్పగించే నాటికే పోలీసులు 1300 మంది అనుమానితులను ఈ కేసులో విచారించారు. .